Huzurabad: మందుబాబులకు లిక్కర్ ఎంత ప్రీతిపాత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాలా..?. తమకు అంత కిక్ ఇచ్చే మందులో జస్ట్ టేస్ట్ తేడా వస్తేనే..ఏదో సర్వస్వాన్ని కొల్పోయినట్టు పీలవుతారు. సరుకు కల్తీ అయితే ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో లిక్కర్ ప్రియులు బీర్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు. కడుపు చల్లబరుచుకోడానికి ఇష్టంగా కొన్న బీర్ బాటిల్లో బల్లి కనిపిస్తే..ఇంక ఏమైనా ఉందా..?. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో బీర్ బాటిల్లో బల్లి దర్శనమివ్వడంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నగరంలోని మల్లిఖార్జున వైన్స్లో ఓ వ్యక్తి బీర్ కొనుగోలు చేయగా..ఏదో ప్రాణి ఉన్నట్లు అనిపించింది. పరిశీలించి చూడగా..బల్లి అని నిర్దారణ అయ్యింది. దీంతో షాపు ఎదుట కష్టమర్లు ఆందోళనకు దిగారు.
ఇది కూడా చదవండి : పీఎఫ్ పెన్షనర్లకు శుభవార్త..