రైనా వేయించుకున్న‌ ట్యాటూల‌లో పేర్లు ఎవ‌రివి ?

|

Aug 11, 2020 | 4:48 PM

సెప్టెంబరు 19 నుంచి స్టార్ట్ కానున్న‌ ఐపీఎల్​ కోసం ఎంతో ఇంట్ర‌స్ట్‌తో ఎదురుచూస్తున్నాడు భార‌త‌ ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా. టోర్నీ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ రాకముందు నుంచే ఘజియాబాద్​లో సాధన స్టార్ట్ చేశాడు.

రైనా వేయించుకున్న‌ ట్యాటూల‌లో పేర్లు ఎవ‌రివి  ?
Follow us on

Suresh Raina tattoos :సెప్టెంబరు 19 నుంచి స్టార్ట్ కానున్న‌ ఐపీఎల్​ కోసం ఎంతో ఇంట్ర‌స్ట్‌తో ఎదురుచూస్తున్నాడు భార‌త‌ ఆల్​రౌండర్​ సురేశ్​ రైనా. టోర్నీ నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ రాకముందు నుంచే ఘజియాబాద్​లో సాధన స్టార్ట్ చేశాడు. నెట్స్​లో బ్యాటింగ్​ చేస్తున్న వీడియోలను తరచుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.  తాజాగా రైనా తన భార్య, పిల్లల పేర్లను చేతిమీద ట్యాటూ వేయించుకున్న పిక్‌ షేర్​ చేశాడు. కూతురు గ్రేసియా పేరును గతంలోనే ట్యూటూ వేయించగా.. తాజాగా తన కుమారుడు రియో, భార్య‌ ప్రియాంక పేర్ల‌ను టాటూ వేయించుకున్నాడు.

లాక్​డౌన్​ తర్వాత అవుట్​డోర్​లో బ్యాటింగ్ ప్రాక్టీసు స్టార్ట్ చేసిన ఇండియా క్రికెటర్లలో సురేశ్​ రైనా ఒకడు. ఘజియాబాద్​లోని గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​తో కలిసి నెలరోజులుగా ప్రాక్టీసు చేస్తున్నాడు. తర్వలోనే చెన్నై మేనేజ్‌మెంట్ నిర్వహించే ట్రైనింగ్ శిబిరంలో‌ చేరనున్నాడు రైనా. ఆగస్టు 22న యూఏఈకి పయనమయ్యేందుకు చెన్నై జట్టు రెడీ అవుతుంది.

Also Read : మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల మాన‌వ‌త్వానికి ఎయిర్ ఇండియా స‌లాం