ఎవ్వరినీ వదలం.. ప్రతీకారం తీర్చుకుంటాం

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:50 PM

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో సహచరులను కోల్పోయిన సీఆర్పీఎఫ్ పగతో రగిలిపోతోంది. ఈ దాడిలో ఇప్పటికి 49మంది జవాన్లను సెంట్రల్ రిజర్వడ్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కోల్పోయింది. అయితే ఈ దాడికి పాల్పడిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఆర్పీఎఫ్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ‘‘మేం మరచిపోం.. మేం క్షమించం.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆ ట్వీట్‌లో స్పష్టం చేసింది. అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. అటు ఈ దాడిపై ప్రధాని మోదీ […]

ఎవ్వరినీ వదలం.. ప్రతీకారం తీర్చుకుంటాం
Follow us on

న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో సహచరులను కోల్పోయిన సీఆర్పీఎఫ్ పగతో రగిలిపోతోంది. ఈ దాడిలో ఇప్పటికి 49మంది జవాన్లను సెంట్రల్ రిజర్వడ్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కోల్పోయింది. అయితే ఈ దాడికి పాల్పడిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఆర్పీఎఫ్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ‘‘మేం మరచిపోం.. మేం క్షమించం.. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం’’ అని ఆ ట్వీట్‌లో స్పష్టం చేసింది. అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. అటు ఈ దాడిపై ప్రధాని మోదీ కూడా తీవ్రంగా స్పందించన విషయం తెలిసిందే. చాలా పెద్ద తప్పు చేశారని, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. దీనికోసం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ప్రధాని మోదీ తెలిపారు.