DRDO Launched Bike Ambulance: కొండకోనల్లో దారిలేని చోట అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువు బైక్ అంబులెన్స్

|

Jan 18, 2021 | 2:22 PM

కొండ కోనల్లో, దారిలేని చోట అత్యవసర పరిస్థితితుల్లో ఎవరికైనా అంబులెన్స్ ద్వారా వైద్య సహాయం అందించాలంటే అది అతికష్టం తో కూడిన పని...  ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో..

DRDO Launched Bike Ambulance: కొండకోనల్లో దారిలేని చోట అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువు బైక్ అంబులెన్స్
Follow us on
DRDO Launched Bike Ambulance: కొండ కోనల్లో, దారిలేని చోట అత్యవసర పరిస్థితితుల్లో ఎవరికైనా అంబులెన్స్ ద్వారా వైద్య సహాయం అందించాలంటే అది అతికష్టం తో కూడిన పని…  ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే మరీ కష్టం.. దీంతో సీఆర్పీఎఫ్ వినూత్న ఆలోచన చేసింది. బైక్ అంబులెన్స్ లను రూపొందించమని రక్షణ పరిశోధన సంస్థకు పలు సూచనలు చేసింది. దింతో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్‌తో కలిసి బైక్ అంబులెన్స్‌ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది.
ఈ బైక్ అంబులెన్స్ లను మావో ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఉన్న అన్ని ప్రాంతాల్లో వినియోగించనున్నామని
 సీఆర్పీఎఫ్‌ వెల్లడించింది.  అంతేకాదు.. కొండాకోనల మధ్యనున్న మారుమూల గ్రామాల్లో సరైన రహదారులు లేని చోట నివసిస్తున్న ప్రజలకు.. ఆపత్కాలంలో వైద్య చికిత్స  అందించడానికి కూడా వీటిని ఉపయోగించనున్నామని తెలిపింది.  గత కొన్ని రోజులుగా ఏపీతో సహా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించింది.  వీటికి రక్షిత అనే నామకరణం చేశారు.
Also Read :  రామతీర్థం విగ్రహాల పునఃప్రతిష్టాపనలో కీలక ఘట్టం.. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించిన అధికారులు..