గ్రేటర్ ఎన్నికల బరిలో నేరచరితులు.. అత్యధికులు బీజేపీ అభ్యర్థులే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్స్

| Edited By: Pardhasaradhi Peri

Nov 25, 2020 | 1:33 PM

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల బరిలో పోటీలో వున్న వారిలో 49 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. వారిలో అత్యధికులు...

గ్రేటర్ ఎన్నికల బరిలో నేరచరితులు.. అత్యధికులు బీజేపీ అభ్యర్థులే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్స్
Follow us on

Criminal candidates in greater elections: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల బరిలో పోటీలో వున్న వారిలో 49 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నట్లు తేలింది. వారిలో అత్యధికులు బీజేపీ తరపున ఎన్నికల బరిలో వుండగా.. రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులున్నారు. మూడో స్థానంలో కాంగ్రెస్, నాలుగో స్థానంలో ఎంఐఎం క్యాండిడేట్స్ వున్నట్లు తేలింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలిచి మొత్తం 1122 మందిలో 49 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికను టీవీ9 సంపాదించింది. మొత్తం 49 మందిపై క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 43 మంది పురుషులు, ఆరుగురు మహిళా అభ్యర్థులున్నారు. 49 మందిపై మొత్తం 96 క్రిమినల్ కేసులు రిజిస్టరై వివిధ దశల్లో దర్యాప్తులో వున్నాయి.

ఈ 49 మందిలో అత్యధికం భారతీయ జనతా పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులున్నారు. బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన వారిలో 17 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 13 మందితో టీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో వున్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 17, టీఆర్ఎస్ అభ్యర్థుల్లో 13 మంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో 12 మంది, ఎంఐఎం క్యాండిడేట్లలో ఏడుగురు అభ్యర్థులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.