సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!

| Edited By:

Aug 18, 2020 | 1:56 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుత కరోనా కాలంలో కూడా.. క్రికెట్‌ అభిమానులకు వినోదం లభించనుంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వేదికగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) టి20

సీపీఎల్‌ టి20: నేటి నుంచి కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌!
Follow us on

Caribbean Premier League from today: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుత కరోనా కాలంలో కూడా.. క్రికెట్‌ అభిమానులకు వినోదం లభించనుంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వేదికగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ నేడు ప్రారంభంకానుంది. ఈసారి టోర్నీలోని మొత్తం 33 మ్యాచ్‌లను పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియం, క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానాల్లో మాత్రమే నిర్వహిస్తారు.

గుజరాత్ లయన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే సిపిఎల్‌లో పాల్గొన్న తొలి భారత క్రికెటర్‌గా అవతరించనున్నారు. మొత్తం ఆరు జట్లు లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో తలపడనున్నాయి. లీగ్‌ దశ ముగిశాక టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ‘ఢీ’కొంటాయి. సెప్టెంబర్‌ 10న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే లీగ్‌ తొలి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టు ఆడుతుంది.

Read More: గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!