హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై సై అన్న సీపీఐ..

| Edited By:

Oct 01, 2019 | 10:14 PM

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. అధికార టీఆర్ఎస్ తమ మద్దతు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తే ఈ ఉపఎన్నికకు మద్దతు ఇస్తామని తెలిపామని చాడ వెల్లడించారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా […]

హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై సై అన్న సీపీఐ..
Follow us on

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మీడియాకు వివరించారు. అధికార టీఆర్ఎస్ తమ మద్దతు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తే ఈ ఉపఎన్నికకు మద్దతు ఇస్తామని తెలిపామని చాడ వెల్లడించారు. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజలకు అన్యాయం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా ప్రజల తరపున ప్రశిస్తామన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానలకు పాల్పడితే తాము పోరాటం చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో టిఆర్ ఎస్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు చాడ. హుజర్‌నగర్ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ కు మద్దతు ఇచ్చినందుకు టి అర్ ఎస్ అభ్యర్థిని బలపరచాలని కోరుతున్నామన్నారు.