శక్తి టీం టిక్‌టాక్‌పై.. సీపీ మీనా సీరియస్: చర్యలు తప్పవు

| Edited By:

Jul 27, 2019 | 4:58 PM

శక్తి టీం చేసిన టిక్‌టాక్‌ వీడియోస్‌పై సీపీ రాజీవ్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై మీనా వివరణ కోరారు. శక్తి టీంపై చర్యలు తప్పవన్నారు. డ్యూటీ అవర్స్‌లో కాలక్షేపం చేయడం సరికాదని.. ఇందులో పర్యవేక్షణ లోపం కూడా ఉందన్నారు. శక్తి టీం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ఇప్పటికే వారిని వివరణ కోరామని.. చర్యలు తప్పవని.. శక్తి టీంను రీ గ్రూపింగ్ చేసి వారి సేవలను వినియోగించుకుంటామని సీపీ […]

శక్తి టీం టిక్‌టాక్‌పై.. సీపీ మీనా సీరియస్: చర్యలు తప్పవు
Follow us on

శక్తి టీం చేసిన టిక్‌టాక్‌ వీడియోస్‌పై సీపీ రాజీవ్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై మీనా వివరణ కోరారు. శక్తి టీంపై చర్యలు తప్పవన్నారు. డ్యూటీ అవర్స్‌లో కాలక్షేపం చేయడం సరికాదని.. ఇందులో పర్యవేక్షణ లోపం కూడా ఉందన్నారు. శక్తి టీం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ఇప్పటికే వారిని వివరణ కోరామని.. చర్యలు తప్పవని.. శక్తి టీంను రీ గ్రూపింగ్ చేసి వారి సేవలను వినియోగించుకుంటామని సీపీ మీనా తెలిపారు.