AP GOVT: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొవిడ్-19 చికిత్స.. హైదరాబాద్‌తో పాటు..

|

Jan 29, 2021 | 4:48 PM

Covid Treatment Under Medical Reimbursement: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కోవిడ్ బారిన పడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి ఇబ్బందిపడుతోన్న వారిని ఆదుకునే క్రమంలో...

AP GOVT: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొవిడ్-19 చికిత్స.. హైదరాబాద్‌తో పాటు..
Follow us on

Covid Treatment Under Medical Reimbursement: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కోవిడ్ బారిన పడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడానికి ఇబ్బందిపడుతోన్న వారిని ఆదుకునే క్రమంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం పరిధిలోకి కొవిడ్-19 చికిత్సను తీసుకొచ్చింది.

ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాష్ట్రం వెలుపల కూడా కరోనా చికిత్సను ఈ పథకం కిందకు తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ చికిత్సకు అవకాశం కల్పించడం విశేషం. రూ.2 లక్షలకు మించకుండా చికిత్స తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓను ఆదేశిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.
Also Read: నిమ్మగడ్డ లేఖలను లైట్‌ తీసుకున్న మంత్రి.. లేఖలు రాయడం ఆయనకు అలవాటేనన్న పేర్ని నాని