కరోనాను అధిగమించి దేశం ఆర్థికాభివ‌ృద్ధిని సాధిస్తోందిః ఆర్థిక శాఖ

|

Oct 05, 2020 | 4:20 PM

కొవిడ్ -19 మహమ్మారిని భారత్ అధిగమించి, ఆర్థిక పునరుద్ధరణకు వేదికగా నిలిచిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నెలవారీ ఆర్థిక దృక్పథ నివేదికలో సెప్టెంబర్ లో అనుకున్నదాని కంటే ఎక్కువ వృద్ధిని సాధించినట్లు తెలిపింది.

కరోనాను అధిగమించి దేశం ఆర్థికాభివ‌ృద్ధిని సాధిస్తోందిః ఆర్థిక శాఖ
Follow us on

కొవిడ్ -19 మహమ్మారిని భారత్ అధిగమించి, ఆర్థిక పునరుద్ధరణకు వేదికగా నిలిచిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నెలవారీ ఆర్థిక దృక్పథ నివేదికలో సెప్టెంబర్ లో అనుకున్నదాని కంటే ఎక్కువ వృద్ధిని సాధించినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీలతో పాటు ఆర్థిక వ్యవస్థను అన్‌లాక్ చేయడం వల్ల ఆర్థిక పునరుద్ధరణ సాధించగలిగామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 17 నుండి 30 వరకు 14 రోజుల కాలానికి సంబంధించిన సమాచారం ప్రకారం, భారతదేశంలో కొవిడ్ -19 కేసులు గరిష్ట స్థాయిని దాటినప్పటికీ ఈ కాలంలో, రోజువారీ సానుకూల కేసుల ఏడు రోజుల సగటు సుమారు 93,000 నుండి 83,000 కు తగ్గిందని తెలిపింది. ఏడు రోజుల సగటు పరీక్షలు 1,15,000 నుండి 1,24,000 కు పెరిగాయని ఆదివారం వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, దేశంలో వ్యాప్తంగా పరిశీలిస్తే తగ్గుతున్న పాజిటివిటీ రేటు ఆర్థిక పునరుద్ధరణ సరిహద్దులను మరింత పెంచడానికి వీలైందని పేర్కొన్నారు. వర్తక వాణిజ్య కార్యకలాపాలు ఉపందుకున్నవేళ ఆన్ లాక్ ప్రక్రియతో అన్ని రంగాలపై పరిమితులు మరింత సడలిస్తున్నందున తగిన జాగ్రత్తలతో స్వీయ రక్షణ అవసరాన్ని నొక్కి చెప్పింది. కాగా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సమాచారం ప్రకారం, భారతదేశంలో మొత్తం కొవిడ్ -19 కేసులు ఆదివారం 65 లక్షలు దాటగా, 55 లక్షలకు పైగా రికవరీలు ఉన్నాయి.

ఆర్థిక పునరుద్ధరణ జరుగుతున్న సందర్భానికి మద్దతుగా ఖరీఫ్ ఆహార ధాన్యాల రికార్డుస్థాయి ఉత్పత్తిని సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గ్రామీణ రంగంలో డిమాండ్ పెరుగుదల బాగనే ఉందన్నారు. అటు ఆటోరంగంలోని ద్విచక్ర వాహనాలు, త్రీ-వీలర్లు, ప్రయాణీకుల వాహనాల రిజిస్ట్రేషన్ పెరుగుదల, ట్రాక్టర్ అమ్మకాలు ఆగస్టులోనే భారీగా పెరగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ఎక్కువ నమోదైనట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా హై-ఫ్రీక్వెన్సీ సూచికలు ఎలా మెరుగుపడ్డాయో కూడా నివేదిక సూచించింది. భారత ఎగుమతులు సెప్టెంబరులో 5 శాతానికి పైగా పెరిగాయని తెలిపింది. అలాగే లాజిస్టిక్ సూచికలు కూడా పెరిగాయి. రైలు సరుకు రవాణా, రైలు ప్రయాణీకుల ఆదాయాలు, కార్గో ట్రాఫిక్ వాల్యూమ్‌లు, దేశీయ విమానయాన రద్దీ మెరుగుపడ్డాయని తెలిపింది.

దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి మొదలైన లాక్‌డౌన్ కారణంగా 2020-21 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 23.9 శాతం కుదించింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రభావం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. దీని ప్రభావంతో ఆ ఏడాది ఆర్థిక వ్యవస్థ 10 శాతానికి పైగా కుదించుకుపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.