#COVID19 టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా?

|

Mar 20, 2020 | 6:59 PM

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇటీవల అమెరికా వెళ్ళి 40 రోజులు అక్కడ వుండి వచ్చారు. రాగానే ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి సందేహం లేకుండా ఇంటికి పంపించారు. కానీ తాజాగా ఆయన్ను ఇంటికే పరిమితమవమని చెబుతూ హోం క్వారెంటైన్ చేశారు. ఎందుకు?

#COVID19 టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా?
Follow us on

Home quarantine for TRS MLA: ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఇటీవల అమెరికా వెళ్ళి 40 రోజులు అక్కడ వుండి వచ్చారు. రాగానే ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి సందేహం లేకుండా ఇంటికి పంపించారు. కానీ తాజాగా ఆయన్ను ఇంటికే పరిమితమవమని చెబుతూ హోం క్వారెంటైన్ చేశారు. కొంపదీసి ఆయనకు కరోనా సోకిందా? ఈ చర్చ ఇపుడు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

కోనేరు కోనప్ప. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈ మధ్య కుటుంబంతో అమెరికా వెళ్ళారు. 40 రోజులు అక్కడ వుండి తిరిగి వచ్చారు. వచ్చాక ఆయన సహజంగానే పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇంత వరకు బాగానే వున్నా.. ఇప్పుడే ఆయనకు సమస్య ఎదురైంది. జిల్లా వైద్య అధికారులు వచ్చి ఆయన్ను 14 రోజుల పాటు హోం క్వారెంటైన్ అవ్వమని చెప్పారు.

దాంతో కోనప్ప మొదటి కంగారు పడ్డా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి, మంత్రుల సూచన మేరకు హోం క్వారెంటైన్‌ అవ్వడానికి రెడీ అయ్యారు. అయితే.. తనకు ఎవరు ఆదేశాలివ్వలేదని.. వైద్య బృందం సలహా, సీఎం సూచన మేరకు సెల్ఫ్‌గానే హోం క్వారెంటైన్ అయ్యానని టీవీ9కు చెప్పారు కోనప్ప. తాను సంపూర్ణ ఆరోగ్యంతో వున్నానని అంటున్నారు. తనకు కరోనా సోకిందన్న వదంతులను నమ్మొద్దని ఆయన చెబుతున్నారు.