AP : జిల్లాకో కోవిడ్ కంట్రోల్ రూమ్…వైర‌స్ పై యుద్ద‌మే

|

Jul 20, 2020 | 8:02 AM

మ‌హ‌మ్మారి కరోనా సింటమ్స్ క‌నిపిస్తే ముందు ఎవ‌రికి చెప్పాలో తెలీదు. టెస్టులు ఎక్క‌డ చేస్తారు..చికిత్స ఎక్కడ అందిస్తారు..?

AP : జిల్లాకో కోవిడ్ కంట్రోల్ రూమ్...వైర‌స్ పై యుద్ద‌మే
Follow us on

మ‌హ‌మ్మారి కరోనా సింటమ్స్ క‌నిపిస్తే ముందు ఎవ‌రికి చెప్పాలో తెలీదు. టెస్టులు ఎక్క‌డ చేస్తారు..చికిత్స ఎక్కడ అందిస్తారు..ఆస్ప‌త్రిల్లో ఉన్న బాధితుల క్షేమ స‌మాచారం కుటంబీకుల‌కు తెలియ‌డం ఎలా..ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు. చుట్టూ అనుమానాలు. అస‌లే భ‌యం. అందునా అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లు. ఈ సందిగ్ద ప‌రిస్థితులను అధిగ‌మించేందుకు ఏపీ స‌ర్కార్ న‌డుం బిగించింది. చికిత్స పొందుతోన్న రోగుల ఆరోగ్య ప‌రిస్థితులు, క్షేమ స‌మాచారాన్ని కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్ర‌తి జిల్లాలో కోవిడ్ కంట్రోల్ రూమ్ స్థాప‌న‌కు యుద్ద ప్రాతిప‌దికన చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయి.

కరోనా లక్షణాలున్నా, వైద్యం వివరాలు కావాలన్నా ఈ కంట్రోల్ రూమ్ ని సంప‌ద్రిస్తే మిగిలిన ప్రాసెస్ అంతా వారు చూసుకుంటారు. ఈ కంట్రోల్ రూమ్‌లు 24 గంట‌లు ప‌నిచేసేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 3 షిఫ్టుల్లో… షిఫ్ట్‌కు ఐదుగురు చొప్పున స్టాఫ్ అందుబాటులో ఉంటారు. జిల్లా పరిధిలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆస్పత్రుల సమాచారం తెలియ‌జేస్తారు. ప‌రీక్ష‌ల‌కు వెళ్లిన వారి ఫలితాల సమాచారమిస్తారు. బాధితులు ఎక్కడ, ఏ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలో చెబుతారు. కోవిడ్‌ కేర్‌లోగానీ, ఆస్పత్రిలోగానీ చేర్చుకోకుంటే వెంటనే కంప్లైంట్ చేస్తే..సంబంధిత అధికారుల‌కు స‌మ‌స్య వివ‌రించి చ‌ర్య‌లు తీసు‌కుంటారు. సమాచార స‌మ‌న్వ‌య లోపంతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకుంటుంది జ‌గ‌న్ స‌ర్కార్.

ప్రస్తుతం విజయవాడలో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉండగా ఇకపై ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని స‌ర్కార్ నిర్ణ‌యింఇంది. ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఏ స‌మ‌యంలో ఫోన్ చేసినా, కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారం అడిగినా, తెలియచేసేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.