Covid 19: కరోనా వైరస్ విజృంభణ.. రష్యాలో చైనీయులకు నో ఎంట్రీ..!

| Edited By:

Feb 19, 2020 | 3:49 PM

Covid 19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. కొవిడ్‌-19 విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా ప్రధాని మిఖాయిల్‌ మిశుస్టిన్‌ తాజాగా ఈ నిర్ణయంపై సంతకం చేశారని రష్యా ఉపప్రధాని టటైనా గోలికోవా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే చైనా […]

Covid 19: కరోనా వైరస్ విజృంభణ.. రష్యాలో చైనీయులకు నో ఎంట్రీ..!
Follow us on

Covid 19: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. కొవిడ్‌-19 విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ జాబితాలోకి చేరింది. చైనా దేశీయులను తమ దేశంలోకి అనుమతించకుండా ప్రధాని మిఖాయిల్‌ మిశుస్టిన్‌ తాజాగా ఈ నిర్ణయంపై సంతకం చేశారని రష్యా ఉపప్రధాని టటైనా గోలికోవా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే చైనా పర్యాటకులు, విద్యార్థులు, పని వీసాలతో వచ్చే వారికి ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించారు.

చైనాలో నిత్యం లక్షలాది మందితో రద్దీగా ఉండే నగరాలు, పట్టణాలన్నీ గతకొన్ని రోజులుగా నిర్మానుష్యంగా మారాయి. ఈ నిషేధం రష్యా విమానాశ్రయాల మీదుగా ప్రయాణం చేసే వారికి వర్తించదని పేర్కొన్నారు. కొవిడ్‌ తమ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే చైనా, ఉత్తర కొరియాలకు విమానాలు, రైళ్ల రాకపోకలను నియంత్రించడంతోపాటు చైనా పౌరులకు వర్క్‌ వీసా జారీ చేయడాన్ని రష్యా నిలిపివేసింది. రష్యాలో చదువుకునే చైనా విద్యార్థులను మార్చి వరకూ రాకూడదని ఇప్పటికే సూచించింది.

మరోవైపు చైనా, హాంకాంగ్‌లో ఆంక్షలతో ప్రజల నిత్యావసరాల కొరత ఎదుర్కొంటున్నారు. చైనాలో ఈ వైరస్‌ కారణంగా 2వేల మంది మరణించగా..దాదాపు 74వేల మంది ఈ వైరస్‌ బారినపడ్డ విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధికారులు వెల్లడించారు. మాస్కో సమయం ప్రకారం గురువారం రాత్రి 9గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని వెల్లడించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని పేర్కొన్నారు.