నర్సుకు ప్ర‌ధాని మోదీ ఫోన్… ఏం మాట్లాడారంటే..?

|

Mar 28, 2020 | 3:50 PM

కరోనా బాధితుల కోసం నిరంత‌రం పనిచేస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సింగ్ స్టాఫ్, క్విక్ రెస్పాండ‌ర్ల‌లో నూతనోత్తేజం నింపేందుకు ప్ర‌ధాని మోదీ యత్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శుక్రవారం సాయంత్రం మహారాష్ట్ర పుణెలోని నాయుడు హాస్ప‌ట‌ల్ లో కోవిడ్ బాధితుల‌కు సేవలందిస్తున్న నర్సు ఛాయకు ఫోన్ చేసిన మోదీ..ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో క‌రోనా బాధితులకు సేవ‌లు చేస్తోన్న స్టాఫ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రధాని, నర్స్ మధ్య సాగిన‌ సంభాషణ సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది. సంభాష‌ణ ఎలా […]

నర్సుకు ప్ర‌ధాని మోదీ ఫోన్... ఏం మాట్లాడారంటే..?
Follow us on

కరోనా బాధితుల కోసం నిరంత‌రం పనిచేస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సింగ్ స్టాఫ్, క్విక్ రెస్పాండ‌ర్ల‌లో నూతనోత్తేజం నింపేందుకు ప్ర‌ధాని మోదీ యత్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శుక్రవారం సాయంత్రం మహారాష్ట్ర పుణెలోని నాయుడు హాస్ప‌ట‌ల్ లో కోవిడ్ బాధితుల‌కు సేవలందిస్తున్న నర్సు ఛాయకు ఫోన్ చేసిన మోదీ..ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో క‌రోనా బాధితులకు సేవ‌లు చేస్తోన్న స్టాఫ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రధాని, నర్స్ మధ్య సాగిన‌ సంభాషణ సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది.

సంభాష‌ణ ఎలా సాగిందంటే :

మోదీ   : క‌రోనా బాధితులకు సేవలు చేయ‌డం పట్ల ఇంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఎదురుకాలేదా?
న‌ర్సు ఛాయ  : మా ఫ్యామిలీకి ప్రమాదమన్న భయం ఉందని.. అయితే ఈ విప‌త్క‌ర‌ పరిస్థితిలో బాధితుల‌కు సేవలు అందించాలి. కుటుంబాన్ని మాన‌సికంగా సంసిద్దం చేసి పనిచేస్తున్నా. అటు ఆందోళన చెందవద్దని బాధితుల‌కు సూచిచ‌డంతో పాటు వారి రిపోర్టులు నెగిటివ్​గా వస్తాయని ధైర్యం నూరిపోస్తున్నా..
మోదీ   : మీలాగే ఎందరో నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్ట‌ర్లు తపస్సులా సేవలను కొన‌సాగిస్తున్నారు.. మీ అనుభవాలు వినడం ఆనందంగా ఉంది.
న‌ర్సు ఛాయ : నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నా.. మీరు 24 గంటలు దేశం కోసం పనిచేస్తున్నారు.. మీతో మాట్లాడటం గర్వంగా ఉంది.