“దాక్కున్న‌ తబ్లీగీల సమాచారం ఇస్తే నజరానా”

|

Apr 20, 2020 | 10:10 PM

త‌ప్పించుకు తిరుగుతూ.. అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ.. క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోన్న తబ్లీగీల ఆచూకి కనిపెట్టడంలో సహాయపడ్డ వారికి 10 వేల రూపాయల న‌జ‌ర‌నా ఇస్తామని కాన్పూర్ పోలీసులు సోమవారం ప్రకటించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కొంత మంది తబ్లీగులు తమ వివరాలను చెప్పకుండా దేశంలో డ్యామేజ్ కి కార‌ణ‌మవుతున్నార‌ని పోలీసులు తెలిపారు. ఢిల్లీ తబ్లీగీ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారిలో కొంద‌రు దాక్కుని ఉండే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. వారు అలా […]

దాక్కున్న‌ తబ్లీగీల సమాచారం ఇస్తే నజరానా
Follow us on

త‌ప్పించుకు తిరుగుతూ.. అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతూ.. క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతోన్న తబ్లీగీల ఆచూకి కనిపెట్టడంలో సహాయపడ్డ వారికి 10 వేల రూపాయల న‌జ‌ర‌నా ఇస్తామని కాన్పూర్ పోలీసులు సోమవారం ప్రకటించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు హెచ్చరించినప్పటికీ కొంత మంది తబ్లీగులు తమ వివరాలను చెప్పకుండా దేశంలో డ్యామేజ్ కి కార‌ణ‌మవుతున్నార‌ని పోలీసులు తెలిపారు. ఢిల్లీ తబ్లీగీ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారిలో కొంద‌రు దాక్కుని ఉండే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. వారు అలా చెయ్య‌డం వ‌ల్ల‌ తమ ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ స‌భ్యులుతో పాటు ఇతరులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. నగరంలో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, మొత్తం 74 కేసులు నమోదవగా అందులో ఎక్కువ శాతం తబ్లీగీతో లింక్ ఉన్న‌వే అని తెలిపారు. స్వ‌త‌హాగా తమంతట తాము అధికారుల ముందుకు వచ్చిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవని కూడా ఆయన పేర్కొన్నారు .