Covid-19: కరోనావైరస్ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా అలర్ట్!

| Edited By:

Mar 03, 2020 | 8:06 PM

కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. కరోనా కారణంగా ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఫిబ్రవరి 25న వియన్నా నుంచి ఢిల్లీకి

Covid-19: కరోనావైరస్ నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా అలర్ట్!
Follow us on

Covid-19: కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. కరోనా కారణంగా ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఫిబ్రవరి 25న వియన్నా నుంచి ఢిల్లీకి ప్రయాణించిన వారిని.. స్క్రీనింగ్‌ సంబంధించి ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ప్రోటోకాల్ పాటించమని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ట్విటర్‌ ద్వారా తెలియజేసింది.

కాగా.. ఎయిర్ ఇండియా ఒక ట్వీట్‌లో ఇలా పేర్కొంది. ‘ఫిబ్రవరి 25న వియన్నా నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కాబట్టి ఆ విమానంలో ప్రయాణించిన వారు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఆ రోజు వియన్నా-దిల్లీ ప్రయాణించిన వారు భారత ఆరోగ్య శాఖ సూచనలను పాటించాల్సిందిగా కోరుతున్నాం’అని ట్వీట్‌లో పేర్కొంది. పూర్తి వివరాలకు భారత ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

[svt-event date=”03/03/2020,7:54PM” class=”svt-cd-green” ]