Covaxin and Covishield: కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. శక్తిసామర్థ్యాలపై ఓ లుక్కేద్దాం పదండి.. ఎంతకాలం సేఫ్..?

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 4:35 PM

ఎట్టకేలకు మహమ్మారిని ఎదిరించే వ్యాక్సిన్స్ వచ్చేశాయి. భారత్‌లో కూడా జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలో  కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ వ్యాక్సిన్‌ల అత్యవసర పంపిణీకి డీసీజీఐ అనుమతి వచ్చింది.

Covaxin and Covishield:  కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. శక్తిసామర్థ్యాలపై ఓ లుక్కేద్దాం పదండి.. ఎంతకాలం సేఫ్..?
Follow us on

Covaxin and Covishield:  ఎట్టకేలకు మహమ్మారిని ఎదిరించే వ్యాక్సిన్స్ వచ్చేశాయి. భారత్‌లో కూడా జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలో  కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ వ్యాక్సిన్‌ల అత్యవసర పంపిణీకి డీసీజీఐ అనుమతి వచ్చింది. మరి ఆ టీకాలు శక్తిసామర్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

కొవిషీల్డ్‌ :

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా డెవలప్ చేసిన ‘కొవిషీల్డ్​‌’ వాక్సిన్‌ను ఇండియాలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది.  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రముఖ పరిశోధకురాలు ‌ సారా గిల్బర్ట్‌ చెబుతున్న వివరాల ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను​ ప్రాథమికంగా కొందరిపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఆ రిజల్ట్స్ బేరీజు వేశాక ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వాడితే కొన్నేళ్లపాటు కరోనా సోకదు. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే రోగ నిరోధకశక్తి కన్నా వాక్సిన్‌ చాలా రెట్లు ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది అని ఆమె చెప్పారు.

 కొవాగ్జిన్‌ :

హైదరాబాద్​కు చెందిన భారత్‌ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా‌  అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు రాకుండానే పంపిణీకి ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి వచ్చింది. ఈ వ్యాక్సిన్ సామర్థ్యంపై డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) పూర్తి విశ్వాసంతో ఉంది.  భారత్‌ బయోటెక్‌ విడుదల చేసిన పరిశోధక పత్రంలో తాము రూపొందించిన వ్యాక్సిన్ యాంటీబాడీలు ఒక మనిషి శరీరంలో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉంటాయని సంస్థ ప్రకటించింది.

 

ఇవి కూడా చదవండి:

Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..

Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే