Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం

|

Dec 26, 2020 | 1:27 PM

ఏపీ సర్కార్ ప్రభుత్వ కార్యకలపాలతో పాటు వివిధ వ్యవస్థలో టెక్పాలజీని భాగం చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య లావాదేవీల్లో తలెత్తే ఆర్థిక వివాదాల పరిష్కారానికి ప్రభుత‌్వం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం
Follow us on

Andhrapradesh: ఏపీ సర్కార్ ప్రభుత్వ కార్యకలపాలతో పాటు వివిధ వ్యవస్థలో టెక్పాలజీని భాగం చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య లావాదేవీల్లో తలెత్తే ఆర్థిక వివాదాల పరిష్కారానికి ప్రభుత‌్వం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం వినియోగించనుంది. వచ్చే నెల నుంచి దీనిని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  ఈ టెక్నాలజీ వల్ల ఆన్‌లైన్‌ ద్వారా నిర్దేశించిన ఫీజు చెల్లించి.. కేసు నమోదు చేసే సౌలభ్యం ఉంటుంది. కేసు పరిశీలనకు అవసరమైన డాక్యుమెంట్స్ సహా ఇతర వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కేసు విచారణ తేదీలు, ఇతర సమాచారం మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే ఫిర్యాదుదారుకు అందుతుంది. రూ.కోటికి మించిన లావాదేవీలపై నమోదయ్యే కేసులను విచారించటానికి వీలుగా విశాఖ, విజయవాడల్లో స్పెషల్ కోర్టులను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.  కేసు నమోదైనప్పటి నుంచి ఆరునెలల్లోగా వివాదాలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వాటిని నెలకొల్పింది.

Als0 Read : 

PM Kisan: పీఎం కిసాన్… న‌గ‌దు మీ ఖాతాల్లోకి పడ్డాయో లేదో ఎలా ఇలా చెక్ చేసుకోండి…

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం