వెడ్డింగ్ ఎట్ ఫస్ట్ సైట్: అలా కలిశారు..ఇలా పెళ్లి చేసుకున్నారు..!

|

Oct 13, 2019 | 8:34 AM

పెళ్లంటే… చూపులు. నిశ్చితార్థం. సంగీత్‌. మెహందీ. నలుగు. విందులు. తిరుగుళ్లు… ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవేవీ లేకపోయినా మనసులు ఒక్కటైతే చాలు, నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవచ్చని నిరూపించింది… హుగ్లీకి చెందిన ఓ జంట. ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థలో పనిచేస్తున్న సుదీప్‌ ఘోషల్‌, ప్రీతమాలు ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే దుర్గాష్టమి నాడు అమ్మవారి మండపంలో తొలిసారి కలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, దండలు మార్చేసుకున్నారు. సంబంధాలు చూసే బాధ లేకుండానే, […]

వెడ్డింగ్ ఎట్ ఫస్ట్ సైట్: అలా కలిశారు..ఇలా పెళ్లి చేసుకున్నారు..!
Follow us on

పెళ్లంటే… చూపులు. నిశ్చితార్థం. సంగీత్‌. మెహందీ. నలుగు. విందులు. తిరుగుళ్లు… ఇలా ఎన్నో పనులుంటాయి. ఇవేవీ లేకపోయినా మనసులు ఒక్కటైతే చాలు, నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవచ్చని నిరూపించింది… హుగ్లీకి చెందిన ఓ జంట. ఓ అంతర్జాతీయ వ్యాపార సంస్థలో పనిచేస్తున్న సుదీప్‌ ఘోషల్‌, ప్రీతమాలు ఫేస్‌బుక్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే దుర్గాష్టమి నాడు అమ్మవారి మండపంలో తొలిసారి కలుసుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, దండలు మార్చేసుకున్నారు. సంబంధాలు చూసే బాధ లేకుండానే, అందమైన కోడలు తమ ఇంటికి వచ్చిందని సుదీప్‌ తల్లి తెగ సంబరపడిపోతోంది.