బాహుబలి-2ని క్రాస్ చేసిన కరోనా వైరస్.. ఆర్జీవీ వెరైటీ ట్వీట్

| Edited By:

Mar 18, 2020 | 9:29 PM

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌పై ఆర్జీవీ జోకులు వేస్తున్నారు. బాహుబలి-2ని కరోనా వైరస్ మించిపోయిందంటూ.. తనదైన స్టైల్లో స్పందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ కరోనాతో అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో..

బాహుబలి-2ని క్రాస్ చేసిన కరోనా వైరస్.. ఆర్జీవీ వెరైటీ ట్వీట్
Follow us on

ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న కరోనా వైరస్‌పై ఆర్జీవీ జోకులు వేస్తున్నారు. బాహుబలి-2ని కరోనా వైరస్ మించిపోయిందంటూ.. తనదైన స్టైల్లో స్పందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ కరోనాతో అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారన్నారు. ఇక కొత్తగా పెళ్లైన జంటలైతే.. విడాకులకు రెడీగా ఉన్నారని ఇదివరకే కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు బాహుబలి సినిమాకి.. ఈ వైరస్‌కి ముడిపెడుతూ ట్వీట్ చేశారు. బాహుబలి-2 క్యూలైన్లను కరోనా మించి పోయిందంటూ ఫన్నీగా స్పందించారు.

కరోనా దెబ్బకు అమెరికాలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థలు, మాల్స్ అన్నీ మూత పడ్డాయి. దీంతో అమెరికన్లు అప్రమత్తమై.. ముందుగానే సరిపడా నిత్యావసర సరుకులు తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున మాల్స్, సూపర్ మార్కెట్ల ముందు కిలో మీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఆర్జీవీ.. బాహుబలి-2 సినిమా టిక్కెట్ల క్యూలైన్లను మించిపోయిందని సరదాగా కామెంట్ చేశారు.

కరోనా వైరస్‌ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతుంది. రోజురోజుకూ మరింత విజృంభిస్తోంది. చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జనం పిట్టల్లా రాలుతున్నారు. దీంతో.. వివిధ దేశాలకు సంబంధాలు తెగిపోయాయి. ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను.. తమ దేశాల్లోకి అనుమతించడం లేదు అధికారులు. ఇప్పుడు భారత్‌లోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా 138 కేసులు నమోదయ్యాయి.