కరోనా: దేశంలో ఒక్క రోజే 22,752 పాజిటివ్ కేసులు, 482 మరణాలు

|

Jul 08, 2020 | 12:36 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 482 మరణాలు సంభవించాయి.

కరోనా: దేశంలో ఒక్క రోజే 22,752 పాజిటివ్ కేసులు, 482 మరణాలు
Follow us on

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 482 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కి చేరుకుంది. ఇందులో 2,64,944 యాక్టివ్ కేసులు ఉండగా.. 20,642 మంది కరోనాతో మరణించారు. అటు 4,56,830 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 2,17,121 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9250 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,02,831 కేసులు, 3165 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 1,18,594 కేసులు నమోదు కాగా, 1636 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులలో సంభవించాయి.