బ్యాంకులను వెంటాడుతున్న కరోనా.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు..

| Edited By:

Jul 25, 2020 | 11:39 AM

కరోనావైరస్ బ్యాంకులను వెంటాడుతోంది. హైదరాబాదులో 50కి పైగా బ్యాంకుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్లకుంటలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి.

బ్యాంకులను వెంటాడుతున్న కరోనా.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus Positive Cases: కరోనావైరస్ బ్యాంకులను వెంటాడుతోంది. హైదరాబాదులో 50కి పైగా బ్యాంకుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్లకుంటలో ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి. పలు బ్యాంకులు హైదరాబాదులో 5 వేలకు పైగా బ్రాంచీలు కలిగిఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ లో 12 బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ 8, 6 న్యూ జనరేషన్ బ్యాంకులు, మరో 40కిపైగా మిగిలిన బ్యాంకుల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. టెస్టులు చేస్తే మరో 5 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బ్యాంకుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడం వల్లే కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు వినికిడి. సరియైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల క్యాష్, డిడిలు, పేపర్స్ ద్వారా, బ్యాంకు సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!