కరోనా అప్డేట్: ఆ ఐదు రాష్ట్రాల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువ.!

|

Sep 07, 2020 | 7:13 PM

కరోనా వైరస్ కరాళ నృత్యానికి దేశం విలవిలలాడుతోంది. ప్ర‌తిరోజు వేలాది కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్య‌ధిక కేసుల‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను..

కరోనా అప్డేట్: ఆ ఐదు రాష్ట్రాల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువ.!
Follow us on

Coronavirus In India: కరోనా వైరస్ కరాళ నృత్యానికి దేశం విలవిలలాడుతోంది. ప్ర‌తిరోజు వేలాది కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్య‌ధిక కేసుల‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భార‌త్ వెన‌క్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి మించి రెండు వంద‌ల కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. దీంతో ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు 42 ల‌క్ష‌ల మార్కును దాటేసింది. ఇక గత వారం రోజులుగా ఇదే రీతిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ఇక దేశంలో కరోనా కేసులు ఆగష్టు 7 నాటికి 20 లక్షల మార్క్ దాటగా.. 30 లక్షల మార్క్ ఆగష్టు 23న, 40 లక్షల మార్క్ సెప్టెంబర్ 5న దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 9 లక్షల కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇక రోజువారీ కేసుల అత్యధికంగా మహారాష్ట్ర(21.6%), ఆంధ్రప్రదేశ్‌(11.8%), తమిళనాడు(11.0%), కర్ణాటక(9.5%), ఉత్తర్‌ప్రదేశ్‌(6.3%) రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 60 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైతే.. 40 శాతం కేసులు మిగతా రాష్ట్రాల్లో బయటపడ్డాయన్నారు.

Also Read: ఏపీ: సచివాలయాల్లో సేవా రుసుములు పెంపు.!