Coronavirus in India: దేశంలో 30కి చేరిన కరోనా కేసులు.. పర్యవేక్షణలో 28,584 మంది..!

| Edited By:

Mar 05, 2020 | 5:10 PM

చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ (కొవిడ్‌19) కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. గత మూడు రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు ప్రజలను మరింత కలవరానికి గురిచేస్తోంది.

Coronavirus in India: దేశంలో 30కి చేరిన కరోనా కేసులు.. పర్యవేక్షణలో 28,584 మంది..!
Follow us on

Coronavirus in India: చైనాతో మొదలై ప్రపంచ దేశాలకు విస్తరించిన కరోనావైరస్ (కొవిడ్‌19) కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. గత మూడు రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు ప్రజలను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 30 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లో ఒకరికి, రాయ్‌పూర్‌లో మరో వ్యక్తికి కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మొత్తం 30కి చేరింది. కొద్దిసేపటి కిందటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది.గురువారం కొత్తగా ఘజియాబాద్‌కు చెందిన మరో వ్యక్తి నమూనాల్లో కరోనా వైరస్ పాజిటివ్‌గా వచ్చిందని, దీంతో మొత్తం కోవిడ్ కేసులు 30కి చేరినట్టు వివరించారు. ఆగ్రాలో వైరస్‌ను అదుపుచేయడానికి చర్యలు ప్రారంభించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న 28,584 మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు.

మరోవైపు.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ యాత్రికులు, విద్యార్థుల గురించి ప్రత్యేక దృష్టిసారించామని, వారిని స్వదేశానికి రప్పించడానికి అక్కడ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, జపాన్ నుంచి వచ్చే పౌరులకు దేశంలోకి ప్రవేశం నిషేధించింది. అయితే, దౌత్య సిబ్బంది, అధికారులకు మాత్రం వెసులుబాటు కల్పించింది. వైరస్ గురించి ఆందోళన చెందవద్దని ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కాంగ్రెస్ నేత గులాబ్ నబీ అజాద్ కోరారు.

[svt-event date=”05/03/2020,4:48PM” class=”svt-cd-green” ]