కరోనా ఎఫెక్ట్: మొబైల్స్‌కూ తప్పని కష్టాలు..!

| Edited By:

Feb 12, 2020 | 11:53 AM

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌.. దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్‌–అసెంబ్లీస్‌ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ‘దేశీ పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, […]

కరోనా ఎఫెక్ట్: మొబైల్స్‌కూ తప్పని కష్టాలు..!
Follow us on

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌.. దేశీ స్మార్ట్‌ఫోన్స్‌ పరిశ్రమను కూడా కలవరపెడుతోంది. పరికరాలు, సబ్‌–అసెంబ్లీస్‌ కోసం చైనాపై ఆధారపడిన దేశీ కంపెనీలకు .. సరఫరాపరమైన సమస్యలతో క్రమంగా సెగ తగులుతోంది. చైనాలో మూతబడిన ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుని, ఈ వారంలోనైనా ఉత్పత్తుల సరఫరా ప్రారంభమవుతుందేమోనని స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ‘దేశీ పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. మరోవైపు, దేశీ స్మార్ట్‌ఫోన్‌ సంస్థలకు అవసరమైన కీలక పరికరాలన్నీ చైనా నుంచే రావాల్సి ఉన్నందున.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అస్సలు బాగాలేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డిమాండ్‌ లేక మార్కెట్‌లో మందగమనం పరిశ్రమను మరింత కలవరపెడుతోందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌ హుబె ప్రావిన్స్‌కే పరిమితమైతే.. సమీప కాలంలో భారతీయ సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని తెలిపింది.

చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్ ప్రస్తుతం 25 దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలో ‘కరోనా తీవ్రత మరో మూడు 4 నెలలు కొనసాగిందంటే మాత్రం ఫార్మా, టెక్స్‌టైల్స్, వాహన సంస్థలకు కీలకమైన ముడి వస్తువుల సరఫరాపరమైన సమస్యలు రావొచ్చు. కరోనా వైరస్‌ (ఎన్‌సీపీ) ప్రబలుతున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2020కి (ఎండబ్ల్యూసీ) దూరంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది.