ఒకే రోజు 405 మందిని బలితీసుకున్న కరోనా

|

Sep 18, 2020 | 9:14 PM

మహారాష్ట్రలో కరోనా కరళ న‌ృత్యం చేస్తోంది. ఒకే రోజు 405 మందిని బలితీసుకుంది. రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటుండటంతో మహా జనం వణికిపోతున్నారు. అయితే మహారాష్ట్రలోని కొన్ని ప్రధాన పట్టణాలు...

ఒకే రోజు 405 మందిని బలితీసుకున్న కరోనా
Follow us on

మహారాష్ట్రలో కరోనా కరళ న‌ృత్యం చేస్తోంది. ఒకే రోజు 405 మందిని బలితీసుకుంది. రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటుండటంతో మహా జనం వణికిపోతున్నారు. అయితే మహారాష్ట్రలోని కొన్ని ప్రధాన పట్టణాలు మాత్రం కరోనా కట్టడికి స్వచ్ఛందగా జనత కర్ఫ్యూకు సిద్ధమవుతున్నారు.

అయితే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా ఉన్నది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కేవలం 24 గంటల్లో కొత్తగా 21,656 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,67,496కు చేరింది. గత 24 గంటల్లో కరోనాతో 405 మంది మరణించారు.

దీంతో మరణాల సంఖ్య 31,791కు పెరిగింది. ఒక రోజులో 22,078 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,34,432కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 3,00,887 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.