పిఠాపురంలో కరోనా కలకలం

|

Aug 24, 2020 | 7:42 PM

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఆలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. పిఠాపురం ప్రముఖ దేవాలయాలలో ఒకటైన శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో 13 మంది సిబ్బందికి కరోన సోకినట్లుగా నిర్దారణ అయ్యింది...

పిఠాపురంలో కరోనా కలకలం
Follow us on

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఆలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. పిఠాపురం ప్రముఖ దేవాలయాలలో ఒకటైన శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో 13 మంది సిబ్బందికి కరోన సోకినట్లుగా నిర్దారణ అయ్యింది. కరోనా లక్షణాలతో ఉన్నటువంటి వారిని పరీక్షించగా వారికి పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆలయంలోని సిబ్బందిని క్వారైంటైన్‌లో ఉండాలని సూచించారు. దీంతో ఆలయాన్నిసంస్థానంను 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లగా అధికారులు ప్రకటించారు.

అయితే పిఠాపురంలోని మరో ఆలయంపై కూడా కోవిడ్ ప్రభావం పడింది. కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయలో ముగ్గురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రెండు ఆలయాల్లో కలిపి మొత్తం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దూకుడు కొనసాగుతోంది. సోమవారం 8,601 కొత్త కేసులు వెలుగు చూడగా, 86 మంది మృత్యువాత పడినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.