Corona Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!

|

Jan 03, 2021 | 10:43 AM

Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. శనివారం రాష్ట్రంలో కరోనా..

Corona Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
Follow us on

Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. శనివారం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నేడు మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 574 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,87,502కు చేరింది. వీరిలో 2,80,565 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,388 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అందులో 3,210 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1549 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేట్ 97.58 శాతంగా ఉంది. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 81 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత రంగారెడ్డిలో 36, మేడ్చల్ మల్కాజిగిరిలో 31 కేసులు నమోదయ్యాయి.