#Corona effect కరోనాతో ఆ ఖైదీలకు కలిసొచ్చింది.. బెయిల్‌పై చక్కగా చెక్కేశారు!

|

Mar 31, 2020 | 5:56 PM

కరోనా వైరస్ వాప్తితో యావత్ ప్రపంచం భయాందోళన చెందుతుంటే కొందరికి మాత్రం కరోనాతో కలిసొస్తుంది. ఇందుకు చక్కని ఉదాహరణ విశాఖపట్నంలో మంగళవారం జరిగింది.

#Corona effect కరోనాతో ఆ ఖైదీలకు కలిసొచ్చింది.. బెయిల్‌పై చక్కగా చెక్కేశారు!
Follow us on

Corona yield luck to prisoners: కరోనా వైరస్ వాప్తితో యావత్ ప్రపంచం భయాందోళన చెందుతుంటే కొందరికి మాత్రం కరోనాతో కలిసొస్తుంది. ఇందుకు చక్కని ఉదాహరణ విశాఖపట్నంలో మంగళవారం జరిగింది. ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం వారికి మంగళవారం సాక్షాత్కారమైంది.

కరోనా వ్యాప్తి చెందకుండా వుండాలంటే ఒకరిద్దరికి మించి ఎవరూ ఎక్కడా కలిసి వుండకూడదన్నది ప్రధాన సందేశం. దాన్ని పాటించేందుకు దేశంలో ఎంత ఇబ్బంది అయినా.. 21 రోజుల లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు విశాఖ జైలు ఖైదీలకు కలిసొచ్చింది. ఎన్నాళ్ళుగానో బెయిల్‌కు అప్లై చేసుకున్నా వర్కౌట్ కాని విఙ్ఞప్తి చివరికి కరోనా పుణ్యమాని వర్కౌట్ అయ్యింది. జైలులో ఖైదీలంతా కలిసి వుంటే వారికి కరోనా సోకే ప్రమాదం వుందన్న ఆలోచనతో జైలు అధికారులు విశాఖ జైలు ఖైదీలను బెయిల్ మీద విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం ఇది వర్కౌట్ అయ్యింది.

కరోనా ప్రభావం నేపధ్యంలో తాత్కాలిక బెయిల్‌పై విడుదలకు ఏర్పాట్లు చకాచకా జరిగిపోయాయి. నేర తీవ్రత, సెక్షన్ల బట్టి తొలివిడతగా 55 మందితో జాబితాను సిధ్ధం చేసిన అధికారులు.. న్యాయమూర్తి పర్యవేక్షణలో ఖైదీల నేర జాబితాను ఓకే చేయడంతో వారి విడుదలకు రంగం సిద్దమైంది. బెయిల్ మీద విడుదలైన వారిని వారి గ్రామాలకు నేరుగా తరలించేందుకు పోలీసులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత విశాఖ సెంట్రల్ జైలు నుంచి రిమాండ్ ఖైదీలను విడుదల చేశారు. వారు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో వుండాలన్న షరతుతో వారిని విడుదల చేశారు.