శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో హై అలెర్ట్ !

|

Sep 09, 2020 | 2:42 PM

కరోనా కేసుల తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో  శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. షార్ లో ప్రస్తుతం  కరోనా కేసులు వణికిస్తున్నాయి.

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో హై అలెర్ట్ !
Follow us on

కరోనా కేసుల తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో  శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు. షార్ లో ప్రస్తుతం  కరోనా కేసులు వణికిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ  100 మందికి పైగా కరోనా సోకింది. షార్ వద్ద భద్రతను పర్యవేక్షించే, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి కూడా కరోనా సోకింది.

కాగా 2020 ప్రయోగాల లక్ష్యంపై కరోనా ఎఫెక్ట్ పడేే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. షార్ లో ఆసుపత్రి మూతపడింది. బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. షార్ నక్షత్ర గెస్ట్ హౌస్ ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చి చికిత్స అందిస్తున్నాారు. కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో షార్ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ బలగాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also Read :

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన !

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్

కొండెక్కిన చికెన్ ధరలు