Corona effect: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. కంపెనీ కీలక నిర్ణయం!

| Edited By: Pardhasaradhi Peri

Mar 23, 2020 | 6:10 PM

దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రీమియం చెల్లింపు గడువును

Corona effect: ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. కంపెనీ కీలక నిర్ణయం!
Follow us on

Corona effect: దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రీమియం చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఎల్‌ఐసీ కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. దీంతో ఎల్‌ఐసీ పాలసీదారులు వారి పాలసీ ప్రీమియం మొత్తాన్ని ఏప్రిల్ 15లోగా చెల్లిస్తే సరిపోతుంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎల్‌ఐసీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా 80 పట్టణాల్లో మార్చి 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.

మరోవైపు.. కోవిద్ 19 దెబ్బకి దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్యాసింజర్ ట్రైన్స్, బస్సులు, మెట్రోలు తిరగడం లేదు. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, జిమ్స్ వంటివి క్లోజ్ అయ్యాయి. అన్ని కీలక పరీక్షలు అన్నీ వాయిదా పడ్డాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా 3 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. 10 వేల మందికి పైగా మరణించారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. కోవిడ్ 19 సోకిన వారి సంఖ్య 426కు దగ్గరిలో ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది మరణించారు.