రెండు వారాల్లో.. ఆ ప్రాంతాల్లో 89 శాతం కరోనా మరణాలు..!

|

Aug 28, 2020 | 2:52 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా గత రెండు వారాల్లో 89 శాతం కరోనా మరణాలు 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

రెండు వారాల్లో.. ఆ ప్రాంతాల్లో 89 శాతం కరోనా మరణాలు..!
Follow us on

Corona Deaths Spike: దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూనే ఉంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య వవిపరీతంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా గత రెండు వారాల్లో 89 శాతం కరోనా మరణాలు 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ లిస్టులో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, యూపీ, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ ఉన్నాయి. దీనితో కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలను త్వరగా గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, కంటైన్మెంట్, హోం ఐసోలేషన్, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్, అంబులెన్స్ సదుపాయాలు తదితర వసతులను మెరుగుపరచడం ద్వారా వ్యాధి సంక్రమణకు అడ్డుకట్ట వేయవచ్చునని రాజీవ్ గౌబా తెలిపారు. కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్ కేసులు, 1,057 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కరోనా కేసులు 33,87,501కు చేరుకోగా.. మరణాల సంఖ్య 61529కి చేరింది. దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసులకు, రికవరీ అయినవారి గణాంకాల మధ్య వ్యత్యాసం దాదాపు 18 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.28 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.82 శాతంగా ఉంది.