Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు.. ఇద్దరు మృతి.. యాక్టివ్ కేసులు ఎన్నంటే..

|

Jan 17, 2021 | 10:41 AM

తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 33,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు.. ఇద్దరు మృతి.. యాక్టివ్ కేసులు ఎన్నంటే..
Follow us on

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 33,298 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం బులిటెన్ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,666కి చేరింది. కాగా నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,577కి చేరింది. కరోనా నుంచి నిన్న 379 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,85,898కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,191 ఉండగా..వీరిలో 2,395 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య మొత్తం 74,61,687కి చేరింది.

Also Read:

Covid 19 may resemble common cold:స్పానిష్ ఫ్లూ, సార్స్, మెర్స్‌ ల్లానే కరోనా వైరస్ కూడా సాధారణ జలుబుగానే మారనుందా ..

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సంబరాలు చూశారా… డప్పు చప్పులతో, బాణాసంచా కాలుస్తూ, ర్యాలీగా…