Telangana News ధాన్యం సేకరణపై రాజకీయ రచ్చ

|

Apr 25, 2020 | 5:45 PM

తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పండిన వారి కారణంగా అధిక దిగుబడులు వచ్చిన నేపథ్యంలో ధాన్యం సేకరణ అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 40 లక్షల ఎకరాలలో వరి ధాన్యం పడిందని, మొత్తం దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పలు దఫాలుగా ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్, భారతీయభారతీయ జనతా పార్టీలు.

Telangana News ధాన్యం సేకరణపై రాజకీయ రచ్చ
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పండిన వరి కారణంగా అధిక దిగుబడులు వచ్చిన నేపథ్యంలో ధాన్యం సేకరణ అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 40 లక్షల ఎకరాలలో వరి ధాన్యం పడిందని, మొత్తం దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పలు దఫాలుగా ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు.

ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కొందరు రైతులు తమ వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు ధాన్యం సేకరణకు ముందుకు రావడం లేదని ఆరోపిస్తూ తాము పండించిన వరి ధాన్యాన్ని పెట్టుకున్న ఉదంతాన్ని బీజేపీ నేతలు ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శుక్రవారం (ఏప్రిల్ 24వ తేదీ) ఉదయం నుంచి సాయంత్రం దాకా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉపవాసం నిరసన దీక్షను పాటించారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు వరి ధాన్యాన్ని రైతాంగం నుంచి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొకటిగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా తెలంగాణలో వరి ధాన్యం సేకరణ జరగడం లేదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సేకరణలో ఈ వారం పది రోజులు అత్యంత కీలకమైన నేపథ్యంలో ప్రభుత్వం తమ ప్రకటనకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ధాన్యం సేకరణ కోసమే 20 వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చామని ప్రకటించారని, ఆ మొత్తాన్ని నిజంగానే ధాన్యం సేకరణకు వెచ్చించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధం కాకపోతే, ధాన్యం సేకరణ వేగవంతంగా జరగకపోతే రైతాంగానికి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.

అయితే విపక్షాల ఆరోపణలను రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ తోసిపుచ్చారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ శరవేగంగా జరుగుతోందని వారు చెప్పుకొచ్చారు. విపక్షాల నేతలు రాజకీయాలు చేయడం మానుకుని ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని వారు కోరారు.