రష్యా రెడ్ స్క్వేర్‌కు భారత త్రివిధ దళాల బృందం

|

Jun 20, 2020 | 1:22 PM

జూన్ 24 న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే సైనిక కవాతులో భారత సాయుధ త్రివిధ దళాల బృందం పాల్గొననున్నట్లు ఆర్మీ తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని రష్యా 75 వ వార్షికోత్సవం వేడుకలను నిర్వహిస్తోంది.

రష్యా రెడ్ స్క్వేర్‌కు భారత త్రివిధ దళాల బృందం
Glimpse of closing ceremony of Ex Indra 2017, at Vladivostok, in Russia on October 29, 2017.
Follow us on

జూన్ 24 న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే సైనిక కవాతులో భారత సాయుధ త్రివిధ దళాల బృందం పాల్గొననున్నట్లు ఆర్మీ తెలిపింది. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని రష్యా 75 వ వార్షికోత్సవం వేడుకలను నిర్వహిస్తోంది. త్రివిధ దళానికి కల్నల్ ర్యాంక్ అధికారి నేతృత్వం వహిస్తారని, నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కి చెందిన మూడు విభాగాల చెందిన సిబ్బంది హాజరుకానున్నారు. అన్ని ర్యాంకుల సంబంధించి 75 మంది సిబ్బంది ఈ పెరేడ్ లో పాల్గొంటారని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సిక్కు లైట్ పదాతిదళ రెజిమెంట్ ప్రధాన ర్యాంక్ అధికారి ఈ సైన్యానికి నాయకత్వం వహిస్తారు. ఇతర శౌర్య పురస్కారాలతో పాటు నాలుగు యుద్ధ గౌరవాలు, మిలిటరీ క్రాస్లను పొందినవారు హాజరుకానున్నారు.

2015 మాస్కోలో నిర్వహించిన విక్టరీ డే 70 వ వార్షికోత్సవ వేడుకలకు అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక కవాతులో గ్రెనేడియర్స్ రెజిమెంట్‌కు చెందిన 75 మంది సభ్యుల ఆర్మీ బృందం పాల్గొంది. భారతదేశం వ్యూహాత్మక భాగస్వాములలో రష్యా ఒకటి. లడఖ్‌లోని గాల్వాన్ ఘటనపై రష్యా భారతదేశానికి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో రష్యా భారత్ కి అండగా నిలిచింది.