కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు…మోదీ నిర్ణయానికి మరో హస్తం నేత మద్దతు

|

Aug 09, 2019 | 1:19 AM

ఆర్టికల్ 370, ఆర్టికల్ 3A ను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొందరు కాంగ్రెస్ బడా నేతలు మాత్రం మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ సొంత పార్టీ నిర్ణయంతో విభేదించారు. కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.  […]

కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు...మోదీ నిర్ణయానికి మరో హస్తం నేత మద్దతు
Follow us on

ఆర్టికల్ 370, ఆర్టికల్ 3A ను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొందరు కాంగ్రెస్ బడా నేతలు మాత్రం మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.  తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ సొంత పార్టీ నిర్ణయంతో విభేదించారు. కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.  యావత్ దేశమంతా మోదీ వెంట ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రాజకీయ పరంగా భేదాభిప్రాయాలు ఉన్పప్పటికీ జాతి ప్రయోజనాల దృష్ట్యా అందరం ఐక్యంగా ఉండాలని సింఘ్వీ స్పష్టంచేశారు.

ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ రాజ్యసభ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.