కాంగ్రెస్ లోక్‌సభ నేతగా అధిర్ రంజన్ చౌదరి!

| Edited By: Pardhasaradhi Peri

Jun 18, 2019 | 7:56 PM

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌదరి ఎంపికయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పదవిని చేపట్టడంపై విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధిర్‌ను లోక్‌సభ పార్టీ నేతగా ఎంపిక చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో 55 మంది సభ్యులుగల పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. […]

కాంగ్రెస్ లోక్‌సభ నేతగా అధిర్ రంజన్ చౌదరి!
Follow us on

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌదరి ఎంపికయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పదవిని చేపట్టడంపై విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అధిర్‌ను లోక్‌సభ పార్టీ నేతగా ఎంపిక చేశారు. సమావేశంలో రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో 55 మంది సభ్యులుగల పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 51 స్థానాలను గెలుచుకుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోదా లభించదు.