congress mla about kcr: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. దీక్ష రద్దు చేస్తూ..

|

Dec 29, 2020 | 8:12 PM

ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ...

congress mla about kcr: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. దీక్ష రద్దు చేస్తూ..
Follow us on

congress mla about kcr decision: ఎల్ఆర్ఎస్ లేకుండానే వ్యవ‌సాయేత‌ర భూముల‌ రిజిస్ట్రేష‌న్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తూ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల జగ్గారెడ్డి స్పందించారు. (Also read: LRS Scheme: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకూ రిజిస్ట్రేషన్లు చేయాలంటూ ఆదేశం..)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని మొదటి నుంచి కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌ఆర్ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం తాము తీవ్రంగా వ్యతిరేకించామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌లో దీక్ష చేయడానికి జగ్గారెడ్డి సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వ ప్రకటనతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.