న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

|

Jul 07, 2020 | 2:07 PM

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయాన్ని కూల్చివేసి అద్భుతమైన అన్ని హంగులతో కూడిన ఒక భవ్యమైన కొత్త సచివాలయాన్ని నిర్వహించాలన్న కేసీఆర్ ప్రభుత్వ సంకల్పానికి...

న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచివాలయాన్ని కూల్చివేసి అద్భుతమైన అన్ని హంగులతో కూడిన ఒక భవ్యమైన కొత్త సచివాలయాన్ని నిర్వహించాలన్న కేసీఆర్ ప్రభుత్వ సంకల్పానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైదరాబాద్ హైకోర్టుపైన, న్యాయ వ్యవస్థపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న సచివాలయ భవనాలను మంగళవారం కూల్చి వేసిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పాత సచివాలయ భవనాలన్నీ ఇరుకు గాను.. పరిపాలనకు ఇబ్బందికరంగా ఉండటంతో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి అనుగుణంగా సరికొత్త భవ్యమైన సచివాలయ భవనాలను నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం తలపెట్టింది. అయితే పాత సచివాలయ భవనాలను కూల్చి వేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలతో పాటు మరికొందరు సామాజిక వేత్తలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కొన్ని రోజుల విచారణ తర్వాత రాష్ట్ర హైకోర్టు కొత్త సచివాలయం నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను అడ్డుకోలేమని, కొత్త భవనాలు నిర్మించాలంటే పాత భవనాలను కూల్చి వేయక తప్పదని తీర్పు చెప్పింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సచివాలయ భవనాల సముదాయాన్ని కూల్చివేసే చర్యలను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకుని ది కానీ ఇవాళ న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం పోయింది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్షకు గవర్నర్ పిలిస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్లకపోవడం ఏంటని టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చాలని ఉత్తమ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.