ఆంధ్రప్రదేశ్​లో 2,901 కరోనా కేసులు నమోదు

|

Oct 27, 2020 | 6:21 PM

ఒక్కరోజు వ్యవధిలో 74,757 నమూనాలను పరీక్షించగా 2,901 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఆంధ్రప్రదేశ్​లో 2,901 కరోనా కేసులు నమోదు
Follow us on

AP Corona Update : ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు అదే చెబుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 74,757 నమూనాలను పరీక్షించగా 2,901 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,11,825కి చేరింది. 24 గంటల వ్యవధిలో 19 మంది కరోనా చికిత్స పొందుతూ మృతిచెందారు.

కడప జిల్లాలో 4, చిత్తూరు 3, కృష్ణా 3, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6,625కి చేరింది. ఒక్కరోజులో 4,352 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 27,300 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76,96,653 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 76.96 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.