తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ డోర్‌ డెలివరీ ఉండదు…మ‌రి ఎలాగంటే..

|

Apr 19, 2020 | 2:05 PM

కరోనా వైరస్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. ఆద‌మ‌రిస్తే చాలు..ఈ వైర‌స్ క్ష‌ణాల్లో శ‌రీరంలోకి వెళ్లి..ఊహించ‌ని ప్ర‌మాదాన్ని తీసుకొస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా..వంట గ్యాస్‌ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ ప‌ద్ద‌తిలో మార్పు చేశాయి. డోర్‌ డెలివరీకి బదులు ‘గేట్‌ డెలివరీ‘ చేయ‌నున్నాయి. డోర్‌ డెలివరీ ప‌ద్ద‌తిలో డెలివరీ బాయ్స్‌ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్‌ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా […]

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ డోర్‌ డెలివరీ ఉండదు...మ‌రి ఎలాగంటే..
Follow us on

కరోనా వైరస్ ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంది. ఆద‌మ‌రిస్తే చాలు..ఈ వైర‌స్ క్ష‌ణాల్లో శ‌రీరంలోకి వెళ్లి..ఊహించ‌ని ప్ర‌మాదాన్ని తీసుకొస్తుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా..వంట గ్యాస్‌ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ ప‌ద్ద‌తిలో మార్పు చేశాయి. డోర్‌ డెలివరీకి బదులు ‘గేట్‌ డెలివరీ‘ చేయ‌నున్నాయి. డోర్‌ డెలివరీ ప‌ద్ద‌తిలో డెలివరీ బాయ్స్‌ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్‌ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారినందున‌.. ‘గేట్‌ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ వంటగ్యాస్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌ శానిటైజ్డ్‌ గ్లౌజులు, మాస్కులు ధరించి, ఇళ్లలోకి సిలిండర్లు తీసుకెళ్లకుండా బయటే ఇచ్చేలా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ ఇప్పటికే ఆయిల్, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇప్ప‌డు ఇదే ప‌ద్ద‌తి ఫాలో కానుంది.