Brazilian President : బ్రెజిల్ ప్రధానికి వ్యతిరేకంగా ఆందోళనలు… ఆ ప్రధానిపై అభిశంసన తీర్మానానికి డిమాండ్

|

Jan 25, 2021 | 8:35 AM

బ్రెజిల్ ప్రధాని జైర్ బొల్సొనారోకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆ దేశంలో వరుసగా రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారంటూ..

Brazilian President : బ్రెజిల్ ప్రధానికి వ్యతిరేకంగా ఆందోళనలు... ఆ ప్రధానిపై అభిశంసన తీర్మానానికి డిమాండ్
Follow us on

Brazilian President : బ్రెజిల్ ప్రధాని జైర్ బొల్సొనారోకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆ దేశంలో  రెండో రోజూలుగా నిరసనలు కొనసాగుతున్నాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేశారు. బొల్సొనారోపై అభిశంసన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల కార్లతో రాజధాని రియో డి జెనీరో వీధులు మోతెక్కాయి.

కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో వసతుల కొరత తీవ్రంగా ఉందని నిరసనకారులు ఆరోపించారు. దేశంలో రాజకీయ పరిస్థితిని మార్చేందుకు అభిశంసన ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గమని అన్నారు. కరోనా కట్టడిలో విఫలమయ్యారని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.