Hero Vikram New Look: హీరో విక్రమ్ కోబ్రా లుక్ విడుద‌ల‌… ఈ సినిమాలో నటిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్…

| Edited By:

Dec 25, 2020 | 2:20 PM

హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలోని లుక్ రిలీజ్ అయ్యింది. విభిన్న పాత్రల్లో నటించే చియాన్‌ ఈ చిత్రంలోనూ కొత్త తరహా పాత్రలో నటించబోతున్నట్లు ఈ లుక్‌తో అర్థమవుతోంది.

Hero Vikram New Look: హీరో విక్రమ్ కోబ్రా లుక్ విడుద‌ల‌... ఈ సినిమాలో నటిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్...
Follow us on

హీరో విక్రమ్ నటిస్తున్న కోబ్రా సినిమాలోని లుక్ రిలీజ్ అయ్యింది. విభిన్న పాత్రల్లో నటించే చియాన్‌ ఈ చిత్రంలోనూ కొత్త తరహా పాత్రలో నటించబోతున్నట్లు ఈ లుక్‌తో అర్థమవుతోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ లుక్‌ను రిలీజ్ చేశారు. వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఆయన కనపడుతోన్న తీరు ఆకర్షిస్తోంది.

 

ఈ పోస్టర్‌లో కళ్ల జోడు పెట్టుకున్న కనిపిస్తున్నాడు. విక్రమ్ కుడి కన్నులోంచి కొన్ని మ్యాథ్స్ కి సంబంధించిన అంకెలను చూస్తున్నట్లు ఈ లుక్‌లో ఉంది. దీనికి, ప్రతి సమస్యకూ మ్యాథమెటిక్స్‌లో పరిష్కారం ఉంటుందన్న క్యాప్షన్ పెట్టారు. ఇందులో విక్రమ్ 20కి పైగా పాత్రల‌లో నటిస్తున్నట్టు టాక్. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.