కోవిద్ 19 ఎఫెక్ట్: ఇక హెచ్‌డీ వీడియోలు చూడలేమా?

| Edited By:

Mar 22, 2020 | 6:49 PM

ప్రపంచ మహమ్మారి కరోనావైరస్ ప్రభావం ఇప్పుడు టెలీకాం కంపెనీలపైనా పడింది. కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తుండడంతో... నెట్‌వర్క్ ట్రాఫిక్‌ ఒత్తిడికి టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి.

కోవిద్ 19 ఎఫెక్ట్: ఇక హెచ్‌డీ వీడియోలు చూడలేమా?
Follow us on

ప్రపంచ మహమ్మారి కరోనావైరస్ ప్రభావం ఇప్పుడు టెలీకాం కంపెనీలపైనా పడింది. కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తుండడంతో… నెట్‌వర్క్ ట్రాఫిక్‌ ఒత్తిడికి టెలికాం కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి వీడియో స్ట్రీమింగ్ వేదికల కారణంగా ఈ ఒత్తడి మరింత పెరిగింది. దీంతో ఇలాంటి ఓటీటీ కంపెనీలన్నీ తమ వీడియో నాణ్యతను తగ్గించేలా ఆదేశించాలంటూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) కేంద్ర టెలీకాం శాఖ (డాట్)కి లేఖ రాసింది.

మరోవైపు.. ‘‘ఈ విపత్కర సమయంలో టెలీకాం ప్రొవైడర్లకు స్ట్రీమింగ్ కంపెనీల సహకారం ఎంతైనా అవసరమని భావిస్తున్నాం. అనేక క్లిష్టమైన అవసరాల దృష్ట్యా నెట్‌వర్క్ వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి పడుతున్నందున ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితిని నియంత్రించాల్సిన అవసరం ఉంది…’’ అని సీవోఏఐ తన లేఖలో పేర్కొంది.