శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు…

|

Feb 03, 2020 | 1:23 PM

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ పాల్గొన్నారు. విశాఖలో ఒకరోజంతా పర్యటించనున్న ముఖ్యమంత్రి.. రెండు గంటల పాటు శారదాపీఠంలో జరిగిన యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు. పూర్ణాహుతికి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పీఠం ఆవరణలో ఉన్న రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని దర్శించారు. తదనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని అందుకున్నారు. పూజా కార్యాక్రమాలు ముగిసిన అనంతరం స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్‌ […]

శారదా పీఠంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు...
Follow us on

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ పాల్గొన్నారు. విశాఖలో ఒకరోజంతా పర్యటించనున్న ముఖ్యమంత్రి.. రెండు గంటల పాటు శారదాపీఠంలో జరిగిన యజ్ఞయాగాదుల్లో పాల్గొన్నారు. పూర్ణాహుతికి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పీఠం ఆవరణలో ఉన్న రాజశ్యామల అమ్మవారి దేవాలయాన్ని దర్శించారు. తదనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని అందుకున్నారు. పూజా కార్యాక్రమాలు ముగిసిన అనంతరం స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా స్వర్ణకంకణధారణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్​, వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీడీ ఛైర్మన్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో శారదా పీఠంలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు.