యూరియా కోసం… రంగంలోకి కేసీఆర్…!

| Edited By: Pardhasaradhi Peri

Sep 06, 2019 | 7:50 PM

యూరియా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. యూరియా తరలింపునకు సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని, రైల్వే శాఖను విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువులు అందించే విషయంపై శుక్రవారం (సెప్టెంబర్ 6) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ యూరియా తరలింపునకు సహకరించాలని […]

యూరియా కోసం... రంగంలోకి కేసీఆర్...!
Follow us on

యూరియా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. యూరియా తరలింపునకు సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని, రైల్వే శాఖను విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువులు అందించే విషయంపై శుక్రవారం (సెప్టెంబర్ 6) ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ యూరియా తరలింపునకు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చిన 15 వేల టన్నుల యూరియా స్టాక్ ఏపీలోని పలు పోర్టుల్లో ఉందని.. ఆ యూరియాను తరలించేందుకు సహకరించాలని కోరారు. దీనికి ఏపీ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏపీ పోర్టుల్లో ఉన్న యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ గ్రామాలకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు మంత్రులు, అధికారులు యూరియాను తెప్పించే పనులను ప్రగతి భవన్ నుంచే పర్యవేక్షిస్తున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించారు. వారి ద్వారా రైల్వే శాఖకు రేక్స్ కోసం ఇండెంట్ పెట్టించారు. తక్షణం వివిధ పోర్టులకు 25 రేక్స్ పంపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.