సంకల్పం ఉంటే ప్రత లక్ష్యం నేరవేరుతుంది: సీఎం కేసీఆర్

|

Jun 26, 2020 | 7:37 PM

రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వరాష్ట్రంలో సత్ఫలితాలు ఉంటాయనడానికి తెలంగాణలో జరగుతున్న అభివృద్ధియే నిదర్శనమని సీఎం కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరి సమిష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు.

సంకల్పం ఉంటే ప్రత లక్ష్యం నేరవేరుతుంది: సీఎం కేసీఆర్
Follow us on

రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వరాష్ట్రంలో సత్ఫలితాలు ఉంటాయనడానికి తెలంగాణలో జరగుతున్న అభివృద్ధియే నిదర్శనమని సీఎం కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం గురువారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరి సమిష్టికృషితో నర్సాపూర్‌ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు.
నర్సాపూర్ అడవులతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు గుర్తు చేశారు. నర్సాపూర్‌ నుంచి సంగారెడ్డి, తూప్రాన్‌, హైదరాబాద్‌కు ఫియెట్‌ కారులో తిరిగినట్లు చెప్పారు. ఒకప్పడు సర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకునేవారని సీఎం గుర్తుచేశారు.

తెలంగాణలో అడవుల పెంపకంపై దృష్టిపెట్టినట్లు చెప్పిన సీఎం.. అడవుల సంరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. హరితహారంతో చేపట్టిన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సత్పలితాలను ఇస్తుందన్నారు. అడవులను నరికివేతను ఏమాత్రం సహించబోమని, కలప దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమన్నారు. కలప స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తాగునీటితో అవసరాలను తీర్చేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమం ప్రజల దాహార్తిని తీర్చిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య సైతం తీరిందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన నిరంతర విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపిన సీఎం ఇకపై ఎలాంటి కరెంట్ సమస్యలు ఉండవన్నారు. అడవుల పెంపకంతోనే తాగు, సాగు నీటి సమస్యలు తీరుతాయన్నారు.

దేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే అన్నారు ముఖ్యమంత్రి. మొక్కల పెంపకంలో ప్రజా ప్రతినిధులతో ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలన్నారు. మొక్కల సంరక్షణకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్యాంకర్‌, ట్రాలీ అందించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సామాజిక అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. సంకల్పం ఉంటే ప్రత లక్ష్యం నేరవేరుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.