ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు…

|

Mar 15, 2020 | 8:02 PM

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాట్రగడ్డ రమేశ్ కుమార్‌ను తాము నియమించలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనుకూలతల కోసం తన సామాజికవర్గ ఐఏఎస్‌ని నియమించుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం నిష్పాక్షికత అని..కాని రమేష్ కుమార్ దానితో పాటు విచక్షణ కూడా కొల్పోయారని పేర్కొన్నారు. అధికారులు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పనిచెయ్యాలని, అప్పుడే వారి గౌరవం ఇనుమడిస్తుందని తెలిపారు. కానీ రమేశ్ కుమార్ అనే వ్యక్తి కరోనా వల్లే […]

ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు...
Follow us on

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కాట్రగడ్డ రమేశ్ కుమార్‌ను తాము నియమించలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనుకూలతల కోసం తన సామాజికవర్గ ఐఏఎస్‌ని నియమించుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణం నిష్పాక్షికత అని..కాని రమేష్ కుమార్ దానితో పాటు విచక్షణ కూడా కొల్పోయారని పేర్కొన్నారు. అధికారులు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పనిచెయ్యాలని, అప్పుడే వారి గౌరవం ఇనుమడిస్తుందని తెలిపారు. కానీ రమేశ్ కుమార్ అనే వ్యక్తి కరోనా వల్లే ఎలక్షన్స్ ‌పోస్ట్ పోన్ చేస్తున్నా అని చెప్పి..అదే ప్రెస్ మీట్‌లోనే గుంటూరు, చిత్తూరు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను.. మరికొందరు అధికారులను సస్పెండ్ చెయ్యడం ఆశ్యర్యంగా ఉందన్నారు సీఎం. విచక్షణాధికారం అనే పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారని, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి తనను సీఎంని చేస్తే..అన్ని నిర్ణయాలు ఈసీనే తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

ఉగాదికి బీదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయమని కలెక్టర్లకు ఈసీ కమిషనర్ లేఖలు రాయడం దారుణమన్నారు. వైసీపీ స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తుందన్న నమ్మకం రావడంతోనే టీడీపీ ఈ రకమైన కుయుక్తులు పన్నుతుందని సీఎం ఆరోపించారు. కరోనా వల్ల ఇబ్బందులు ఉంటే హెల్త్ సెక్రటరీతో సంప్రదింపులు జరపాలి కదా అని జగన్ ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. మార్చి 31లోపు స్థానిక ఎన్నికలు ముగిస్తే, 14 ఆర్థిక సంఘం నుంచి దాదాపు రూ. 5000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానికి అందుతాయని, వాటిని రాకుండా చెయ్యడానికి చంద్రబాబు కక్షకట్టారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.