ఏపీలో బాగా తగ్గిన ఆదాయం.. అధికారులతో సీఎం సమావేశం

| Edited By: Srinu

Aug 29, 2019 | 2:02 PM

ఏపీలో ఆదాయార్జన మార్గాలపై దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత వృద్ధి సాధించలేదని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో స్టీల్, ఐరన్ రేట్లు తగ్గడం, సిమెంట్ రేటు కూడా తగ్గడంతో […]

ఏపీలో బాగా  తగ్గిన ఆదాయం.. అధికారులతో సీఎం సమావేశం
Follow us on

ఏపీలో ఆదాయార్జన మార్గాలపై దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్, రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆదాయ మార్గాలపై సీఎం అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా వాణిజ్య పన్నుల్లో 14 శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని, గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంత వృద్ధి సాధించలేదని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో స్టీల్, ఐరన్ రేట్లు తగ్గడం, సిమెంట్ రేటు కూడా తగ్గడంతో రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడుతున్నట్టుగా వివరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సర చివరి నాటికి పరిస్థితిలో మార్పు ఉండొచ్చని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని, బెల్టు షాపుల ఏరివేతతో జూలై 12 నాటికి 12 లక్షల కేసుల వినియోగం తగ్గినట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఇదిలా ఉంటే రిజస్ట్రేషన్ శాఖలో కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని అధికారులను ఆదేశించారు. మద్య నిషేదాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దృష్ట్యా నియంత్రణ, నిషేదం అమలుకు అన్ని విభాగాలను బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.