వైఎస్ విజయమ్మ గొప్ప మ‌న‌సు..పూజారుల‌ను ఆదుకోవాలంటూ ఆ మంత్రికి ఫోన్…

|

Apr 18, 2020 | 8:02 AM

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. లాక్‌డౌన్ వేళ పితృకర్మలు నిర్వహించే పురోహితులు ఇబ్బందులు పడుతున్న విష‌యం ఆమె దృష్టికి వ‌చ్చింది. ఉపాధిలేక వారు క‌ష్టాలు పడుతుండడంపై విజయమ్మ స్పందించారు. విజయవాడ అమ్మ‌వారి స‌న్నిధిలోని దుర్గాఘాట్‌ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు కర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా వారంతా ఇప్పుడు ఇళ్ల‌కే పరిమితమయ్యారు. క‌ర్మ‌లు చేయించుకునేందుకు […]

వైఎస్ విజయమ్మ గొప్ప మ‌న‌సు..పూజారుల‌ను ఆదుకోవాలంటూ ఆ మంత్రికి ఫోన్...
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తల్లి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. లాక్‌డౌన్ వేళ పితృకర్మలు నిర్వహించే పురోహితులు ఇబ్బందులు పడుతున్న విష‌యం ఆమె దృష్టికి వ‌చ్చింది. ఉపాధిలేక వారు క‌ష్టాలు పడుతుండడంపై విజయమ్మ స్పందించారు. విజయవాడ అమ్మ‌వారి స‌న్నిధిలోని దుర్గాఘాట్‌ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు కర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా వారంతా ఇప్పుడు ఇళ్ల‌కే పరిమితమయ్యారు. క‌ర్మ‌లు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో వారు తీవ్రంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొంద‌రికి తిన‌డానికి కూడా ఆహారం దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. విష‌యం తెలియ‌గానే చ‌లించిపోయిన విజ‌య‌మ్మ‌..వెంట‌నే దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడారు. పురోహితులను ఆదుకోవాలని మంత్రిని రిక్వెస్ట్ చేశారు. దీంతో వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు తెలిపారు.